మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..

| Edited By:

Jul 24, 2020 | 8:12 AM

గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగానే కాకుండా.. దేశంలోనూ భూ ప్ర‌కంప‌న‌లు రావ‌డం స‌ర్వ ‌సాధార‌ణమైపోయింది. తాజాగా భార‌త్‌లోని మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూమి కంపించింది. ఈ రోజు తెల్ల‌వారు జామున మ‌హా రాష్ట్ర‌, జ‌మ్మూలో స్వ‌ల్పంగా భూ ప్ర‌కంప‌న‌లు..

మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..
Follow us on

గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగానే కాకుండా.. దేశంలోనూ భూ ప్ర‌కంప‌న‌లు రావ‌డం స‌ర్వ ‌సాధార‌ణమైపోయింది. తాజాగా భార‌త్‌లోని మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూమి కంపించింది. ఈ రోజు తెల్ల‌వారు జామున మ‌హా రాష్ట్ర‌, జ‌మ్మూలో స్వ‌ల్పంగా భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. కాగా మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో గురువారం మ‌ధ్య‌రాత్రి 12.26 స‌మ‌యంలో స్వ‌ల్పంగా భూకంపం సంభ‌వించింది. దీంతో ఇళ్ల‌లోని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. మాగ్నిట్యూడ్‌పై దీని తీవ్ర‌త 3.1గా న‌మోదైంద‌ని ఎన్‌సీఎస్ పేర్కొంది.

జ‌మ్మూక‌శ్మీర్‌లోని కాత్ర‌లో శుక్ర‌వారం ఉద‌యం 5.11 గంట‌ల ప్రాంతంలో భూకంపం సంభ‌వించింది. మాగ్నిట్యూడ్‌పై దీని తీవ్ర‌త 3.0గా న‌మోద‌య్యింది. క‌త్రాకి తూర్పున 89 కిలో మీట‌ర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్న‌ట్లు.. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. కాగా వారం వ్య‌వ‌ధిలో క‌త్రాలో భూ ప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇద రెండో సారి. జులై 17వ తేదీన 3.9 తీవ్ర‌తో భూకంపం వ‌చ్చింది. అలాగే ఈ నెల 8న రాజౌరిలో కూడా 4.3 తీవ్ర‌త‌తో భూమి కంపించింది.

Read More:

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్‌.. ఉధృతంగా కేసులు న‌మోదు..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. విప‌రీతంగా పెరిగిపోతున్న కేసులు..