ప్రేమించిన అమ్మాయి పెళ్లి మరో వ్యక్తితో జరుగుతోందని యువకుడి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ మరీ…
తనను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధంకావడంతో తట్టుకోలేక ఓ యువతుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది.

Lover Suicide attempt in rangareddy: తనను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధంకావడంతో తట్టుకోలేక ఓ యువతుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది. ఆమన్‌గల్‌కు చెందిన సాయి ప్రసాద్ గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే సాయి ప్రసాద్ ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం చేయడానికి ఈనెల 31న ముహుర్తం ఖరారు చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన సాయి ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమినించిన అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆత్మహత్యాయత్నం చేసేముందు సాయి ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రేమించిన యువతి మోసం చేయడంతోనే ఆత్మహత్యాయత్నాకి పాల్పడినట్లు సదరు వీడియోలో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
