బోస్టన్ రిపోర్టు కాదు బోగస్ రిపోర్టు.. చినబాబు రెచ్చిపోయారుగా!

|

Jan 04, 2020 | 6:07 PM

ఏపీ రాజధాని రచ్చ రోజుకో లెవల్‌కు చేరుతోంది. తాజాగా బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదిక రాజధాని రగడను మరో లెవల్‌కి చేర్చింది. బోస్టన్ నివేదికను అధికార వైసీపీ నేతలు ఆకాశానికెత్తుతుంటే.. విపక్ష టీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. బోస్టన్ రిపోర్టును ఓ చిత్తు కాగితంతో చంద్రబాబు పోలిస్తే ఆయన తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. ‘‘బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్.. అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతో గత ఐదేళ్లలో జగన్ […]

బోస్టన్ రిపోర్టు కాదు బోగస్ రిపోర్టు.. చినబాబు రెచ్చిపోయారుగా!
Follow us on

ఏపీ రాజధాని రచ్చ రోజుకో లెవల్‌కు చేరుతోంది. తాజాగా బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదిక రాజధాని రగడను మరో లెవల్‌కి చేర్చింది. బోస్టన్ నివేదికను అధికార వైసీపీ నేతలు ఆకాశానికెత్తుతుంటే.. విపక్ష టీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. బోస్టన్ రిపోర్టును ఓ చిత్తు కాగితంతో చంద్రబాబు పోలిస్తే ఆయన తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. ‘‘బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్.. అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతో గత ఐదేళ్లలో జగన్ గారు రాసిన స్క్రిప్ట్‌నే మరోసారి బోగస్ రిపోర్ట్ పేరుతో బయటపెట్టారు’’ అంటూ ఘాటైన పదజాలంతో ట్వీట్ చేశారు చినబాబు.

పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్ద పెద్ద నగరాల శివార్లలో అభివృద్ది చేసిన శాటిలైట్ సిటీలు, టెక్నాలజీ హబ్‌లు, అర్బన్ టౌన్ షిప్లను గ్రీన్ సిటీలుగా చూపించి అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడాన్ని బట్టే ఈ బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) రిపోర్ట్ చిత్తశుద్ది ఏంటో అర్ధం అవుతుందని లోకేశ్ కామెంట్ చేశారు. అన్ని నగరాల గురించి చెప్పిన రిపోర్టులో సంవత్సరానికి లక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తున్న గ్రీన్ ఫీల్డ్ సిటీ అయిన సైబరాబాద్‌ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు అమరావతి అనువైన ప్రాంతం అని చట్టబద్ధత ఉన్న శివ రామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు.

అమరావతి ముంపునకు గురవుతుందని, భూమి స్వభావం వలన నిర్మాణ వ్యయం పెరుగుతుందని అసత్యాలు చెబుతూ కోర్టుకు వెళ్ళి మరీ జగన్ మొట్టికాయలు తిన్నారని లోకేశ్ వ్యంగ్యోక్తి విసిరారు. అయినా వైసీపీ నేతల వక్ర బుద్ధి మారలేదన్నారు. కోర్టులు చివాట్లు పెట్టిన అంశాలనే రిపోర్టులో పెట్టి అది బోగస్ రిపోర్ట్ అని జగన్ గారే స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రుల స్టేట్ మెంట్లనే కమిటీ రిపోర్టులుగా ఇచ్చారు. జీఎన్ రావు, బోస్టన్ రిపోర్టుల విశ్వసనీయత ఏంటో న్యాయస్థానాల ముందు తేలిపోతుందని చెప్పారు. కన్సల్టింగ్ కంపెనీలను ముంచడం జగన్ గారికి అలవాటేనంటూ ఘాటైన పదజాలంతో లోకేశ్ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.