వేలూరు లోక్‌సభ పోలింగ్‌ రద్దు..రాష్ట్రపతి సంచలన నిర్ణయం

|

Apr 17, 2019 | 11:41 AM

న్యూఢిల్లీ: తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నాడు జరగాల్సిన ఎన్నికను నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపారు.  వేలూరు నియోజకవర్గంలో ధన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎన్నికను నిలిపివేస్తూ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అక్కడ డీఎంకే నేతకు చెందిన సిమెంట్ గోడౌన్‌లో దాదాపు రూ.11కోట్లు నగదును ఎన్నికల సంఘం అధికారులు […]

వేలూరు లోక్‌సభ పోలింగ్‌ రద్దు..రాష్ట్రపతి సంచలన నిర్ణయం
Follow us on

న్యూఢిల్లీ: తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నాడు జరగాల్సిన ఎన్నికను నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపారు.  వేలూరు నియోజకవర్గంలో ధన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎన్నికను నిలిపివేస్తూ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అక్కడ డీఎంకే నేతకు చెందిన సిమెంట్ గోడౌన్‌లో దాదాపు రూ.11కోట్లు నగదును ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. దీంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ నియోజకవర్గ ఎన్నికను నిలుపుదల చేయాలని ఈ నెల 14న రాష్ట్రపతి కోవింద్‌కు ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఎన్నికను నిలిపివేత చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.  మరో విడతలో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.  కాగా, తమిళనాడులోని 39 స్థానాల్లో ఏప్రిల్‌ 18న ఎన్నికలు జరగాల్సి ఉంది. వేలూరు ఎన్నిక రద్దుతో 38 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది.