ఏపీలోని ఆ నగరంలో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

| Edited By:

Aug 08, 2020 | 9:24 AM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా వైరస్ ఉధృతి తగ్గడంలేదు. ప్రజలు కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం చివరకు

ఏపీలోని ఆ నగరంలో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?
Follow us on

Lockdown will be imposed again in Ongole: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా వైరస్ ఉధృతి తగ్గడంలేదు. ప్రజలు కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకుండా, సామజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగానే తిరుగుతున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించింది.

కాగా.. దాదాపు రెండు వారాలపాటు నగరంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి స్పష్ట్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి. నిత్యావసరాలకు సంబంధించి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకే అనుమతి ఇవ్వనున్నారు. అత్యవసరమైన మందుల దుకాణాలు, పెట్రోలు షాపులు తెరుస్తారు. నగరంలో అనధికారికంగా రెండు వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే కరోనా కేసులు వెయ్యి దాటిపోయాయి. దీంతో ఒంగోలు నగరం మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.