పెద్దదవుతున్న దివీస్‌ గొడవ..పీక్స్‌కు చేరిన అల్లర్లు..గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టిన మత్స్యకారులు

|

Dec 17, 2020 | 6:11 PM

దివీస్‌ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులగా జరుగుతున్న అల్లర్లు పీక్స్‌కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్‌ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్‌ నిర్మించిన ఓ గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు..

పెద్దదవుతున్న దివీస్‌ గొడవ..పీక్స్‌కు చేరిన అల్లర్లు..గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టిన మత్స్యకారులు
Follow us on

దివీస్‌ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులగా జరుగుతున్న అల్లర్లు పీక్స్‌కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్‌ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్‌ నిర్మించిన ఓ గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు ఉద్యమకారులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకొచ్చారు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను పీకి పారేశారు.

ఫ్యాక్టరీలో ఉన్న కంటైనర్‌, జనరేటర్‌ను తగలబెట్టారు. నిర్మాణంలో ఉన్న గోడలను కూలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని భావించడంతో.. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంటనే విడుదల చేయాలని.. స్థానికులు అక్కడే బైఠాయించారు.

తూర్పుతీరంలో దివీస్‌ లేబరేటరీస్‌ ల్యాబ్‌.. పొలిటికల్‌ గేమ్‌కు అద్దం పడుతోంది. కొత్త యూనిట్‌ ఏర్పాటుపై అధికార, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. గతంలో ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడంతో.. స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ ల్యాబ్‌ విషయంలో.. వైసీపీ, టీడీపీల తీరు అవకాశవాద రాజకీయాలను గుర్తు చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దివిస్‌ ల్యాబ్‌ను ఒప్పుకునేది లేదని మత్స్యకారులు తెగేసి చెబుతున్నారు. ల్యాబ్ ఏర్పాటుతో మత్స్యకారులకు నష్టం ఏర్పడటంతో పాటు.. జీవనోపాధి దెబ్బతింటుందని నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఒకే పరిశ్రమపై టీడీపీ-వైసీపీలు భిన్నస్వరాలు వినిపిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంపై అవకాశవాద రాజకీయాలకు దిగుతున్నాయని మండి పడుతున్నారు. తమ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ నిర్మాణం వద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.