అమెరికా తరహాలో.. ఉగ్రవాదం అంతానికి రావత్‌ ప్రతిపాదన..!

| Edited By:

Jan 16, 2020 | 4:54 PM

9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా వ్యవహరిస్తున్న తరహాలో కఠిన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని భారత రక్షణ శాఖ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మార్గం ఉందని గురువారం పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక హెచ్చరికలో తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఓ సదస్సులో మాట్లాడుతూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా దాడి తర్వాత అగ్రరాజ్య సైనిక బలగాలు అఫ్గానిస్థాన్‌లో పాగా వేశాయి. […]

అమెరికా తరహాలో.. ఉగ్రవాదం అంతానికి రావత్‌ ప్రతిపాదన..!
Follow us on

9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా వ్యవహరిస్తున్న తరహాలో కఠిన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని భారత రక్షణ శాఖ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మార్గం ఉందని గురువారం పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక హెచ్చరికలో తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఓ సదస్సులో మాట్లాడుతూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా దాడి తర్వాత అగ్రరాజ్య సైనిక బలగాలు అఫ్గానిస్థాన్‌లో పాగా వేశాయి. తాలిబన్లపై తిరుగులేని పోరాటం చేశారు. ఎట్టకేలకు దాడుల సూత్రధారి, తాలిబన్‌ అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను పాక్‌లో వెతికి పట్టుకొని 2011లో తుదముట్టించారు.

ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశాలను ఉగ్రవాదంపై జరుపుతున్న పోరులో చేర్చకూడదని రావత్‌ అభిప్రాయపడ్డారు. అటువంటి దేశాల్ని ‘దౌత్యపరంగా ఏకాకి’ని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా అడుగు ముందుకేస్తూ ఆర్థిక ఆంక్షలు విధించడం సముచితమైన నిర్ణయమన్నారు. ఉగ్రముఠాలకు ఆయుధాలు, నిధులతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించే దేశాలు ఉన్నంత వరకు ఉగ్రవాదంపై జరుగుతున్న పోరుకు ముగింపు పలకలేమన్నారు. కశ్మీర్‌లో యువత ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.