LIC Jeevan Shanti : ఎల్‌ఐసీ తన కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందిస్తోన్న విషయం తెలిసిందే. వాటిలో జీవన్ శాంతి పాలసీ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఒకసారి మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దీన్ని తీసుకున్న వారికి ప్రతి నెలా పింఛన్ వస్తుంది. ఈ పాలసీలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో వెంటనే పెన్షన్ వస్తుంది. మరో ఆప్షన్‌లో 5, 10, 15, 20 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. కస్టమర్ల ఇష్టాన్ని బట్టి పాలసీ తీసుకోవచ్చు.
చెల్లించే మొత్తాన్ని బట్టి ఎంత పింఛన్ వస్తుందనే అంశం ఆధారపడి ఉంటుంది. వయస్సు కూడా పింఛన్ డబ్బులపై ప్రభావం చూపుతుంది. పాలసీ తీసుకోవాలని భావించే వారికి కనీసం 30 ఏళ్లు ఉండాలి. పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. ఊదాహరణ చెప్పాలంటే…30 ఏళ్ల వయసున్న వ్యక్తి ఎల్‌ఐసీ జీవన్ శాంతి పాలసీ రూ.10 లక్షల మొత్తానికి తీసుకుని.. పెన్షన్ కూడా తొలి ఏడాది నుంచే పొందాలనే ఆప్షన్ ఎంచుకుంటే… ప్రతి నెలా దాదాపు రూ.4,300 ఫించన్ వస్తుంది.
Also Read :
TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు
Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?