నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం

|

Oct 31, 2020 | 12:00 PM

నల్లగొండ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. నల్లగొండ మండలం దోమలపల్లి, అప్పాజీపేట గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు.

నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం
Follow us on

నల్లగొండ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. నల్లగొండ మండలం దోమలపల్లి, అప్పాజీపేట గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో ఏ క్షణాన చిరుత దాడి చేస్తుందోనని జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని జంతువు అరుపులు విన్న గ్రామస్తులు అవి చిరుతవేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, పశువులను కాసేందుకు కాపర్లు చిరుత సంచారంతో హడలిపోతున్నారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చింది చిరుత లేదా హైనా లేక మరో ఇతర జంతువా గుర్తించేపనిలో పడ్డారు. ఇందు కోసం ఆయా గ్రామాల్లో పలుచోట్ల సీసీ కెమెరాల్లో ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లో బోన్లను సైతం ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేయించారు. రాత్రివేళ ఎవరూ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో జంతువును గుర్తిస్తామని అటవీశాఖ అధికారులు భరోసా కల్పిస్తున్నారు.