కరోనా ఎఫెక్ట్: డాక్టర్లు, నర్సులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా గ్రీన్ కార్డ్

| Edited By:

May 10, 2020 | 11:09 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడి చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ

కరోనా ఎఫెక్ట్: డాక్టర్లు, నర్సులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా గ్రీన్ కార్డ్
Follow us on

Green Cards: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడి చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్‌ ఆమోదించినప్పటికీ జారీ కాని గ్రీన్‌ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని బిల్లులో పేర్కొన్నారు.

వివరాల్లోకెళితే.. అమెరికాలో 12లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 77 వేలు దాటింది. ఈ నేపథ్యంలో చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్‌ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్‌కార్డులకు అనుమతి ఇచ్చే అధికారం అక్కడి కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు.

కాగా.. అమెరికా కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనల ప్రకారం చట్టం ఆమోదం పొందితే 25వేలమంది నర్సులు, 15వేల మంది వైద్యులు గ్రీన్‌కార్డులను పొందే అవకాశం ఉంది. వీరంతా కొవిడ్‌-19పై పోరులో భాగంగా వైద్య సేవలు అందించాలి. హెచ్‌-1బీ, జే2 వీసాలపై ఉన్న భారతీయ వైద్యులు, నర్సులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.