కన్న పిల్లలపై అత్యాచారం చేసిన కిరాతకుడికి జీవితఖైదు.. తీర్పు వెలువరించిన ఎల్బీనగర్ కోర్టు

కన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి జీవితఖైదు విధించింది న్యాయస్థానం.

  • Balaraju Goud
  • Publish Date - 1:20 pm, Fri, 1 January 21
కన్న పిల్లలపై అత్యాచారం చేసిన కిరాతకుడికి జీవితఖైదు.. తీర్పు వెలువరించిన ఎల్బీనగర్ కోర్టు

కన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి జీవితఖైదు విధించింది న్యాయస్థానం. 2019 లో జరిగిన లైంగిక దాడి కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచటన తీర్పు వెలువరించింది. సొంత బిడ్డలపైనే దారుణానికి ఒడిగట్టిన మొగిలి అమర్నాథ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించింది. తన పిల్లలపైనే అత్యాచారం చేసి వీడియోలు చిత్రీకరించిన అమర్నాథ్.. వీడియోలను అడ్డం పెట్టుకొని పదేపదే కన్న పిల్లలపై అత్యాచారం చేశాడని రుజువైంది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని పిల్లలను బెదిరించాడు. అయితే, బంధువుల సాయంతో అమర్నాథ్ పిల్లలు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. 2019 లో నమోదైన ఈ కేసు విచారణ పూర్తి కావడంతో ఇవాల ఎల్బీనగర్ కోర్టు తీర్పు వెల్లడించింది.