మరో ఆరు నెలల పాటు.. గవర్నర్ పాలనే…

| Edited By:

Jun 28, 2019 | 8:03 PM

జమ్ముకశ్మీర్‌లో మరో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. జూలై 2వ తేదీతో అక్కడ గవర్నర్ పాలన ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ గవర్నర్ పాల‌నను పొడిగించాల‌ని అమిత్ షా బిల్లులో కోరారు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రంజాన్‌, అమ‌ర్‌నాథ్ యాత్ర వ‌ల్ల అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హిణ ఆల‌స్య‌మైన‌ట్లు చెప్పారు. అమర్నాథ్ యాత్ర […]

మరో ఆరు నెలల పాటు.. గవర్నర్ పాలనే...
Follow us on

జమ్ముకశ్మీర్‌లో మరో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. జూలై 2వ తేదీతో అక్కడ గవర్నర్ పాలన ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ గవర్నర్ పాల‌నను పొడిగించాల‌ని అమిత్ షా బిల్లులో కోరారు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రంజాన్‌, అమ‌ర్‌నాథ్ యాత్ర వ‌ల్ల అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హిణ ఆల‌స్య‌మైన‌ట్లు చెప్పారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన తరువాత.. ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు షా తెలిపారు.