న్యూఢిల్లీ: బివైడి ఆటోమొబైల్ తయారీ సంస్థ ప్రపంచంలోనే అతి పొడవైన ఎలక్ట్రిక్ బస్సును తయారు చేశారు. దీనికి కె12ఎ అని నామకరణం చేశారు. ఇక ఇది కొలంబియా దేశం కోసం తయారుచేయబడింది. కాగా ఇది ప్రపంచంలోనే అతిపొడవైన బస్సు. దీని పొడవు 88 అడుగులు. దీనిని ఆ సంస్థ ఏప్రిల్ 1న అధికారికంగా ప్రారంభించింది. ఈ బస్సులో మొత్తం 250 మంది ప్రయాణం చేయవచ్చు. ఇది గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక ఈ బస్సు ను ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.