మూడోసారి లంక ప్రీమియర్ లీగ్ వాయిదా..

కరోనా ఎఫెక్ట్ కారణంగా శ్రీలంక క్రికెట్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నీ మరోసారి వాయిదా పడింది.

మూడోసారి లంక ప్రీమియర్ లీగ్ వాయిదా..

Updated on: Nov 07, 2020 | 4:36 PM

Lanka Premier League: కరోనా ఎఫెక్ట్ కారణంగా శ్రీలంక క్రికెట్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నీ మరోసారి వాయిదా పడింది. తొలుత ఈ లీగ్‌ను ఆగష్టు 28న నిర్వహించాలని చూడగా.. అది కాస్తా నవంబర్ 14కు.. ఆ తర్వాత నవంబర్ 21కి వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా నవంబర్ 27 నుంచి లంక ప్రీమియర్ లీగ్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు జరగుతాయి. మొదట ఈ మ్యాచులను మూడు స్టేడియంలలో జరగపాలని చూశారు.

Also Read: దీపావళి బంపర్ ఆఫర్.. 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్..!

అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటినన్నింటినీ ఒకే వేదికలో నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇందుకు హంబన్‌తోట వేదికను ఎంపిక చేశారు. ఈ లీగ్ ఫైనల్ డిసెంబర్ 17న జరగనుంది. ఇక విదేశీ ఆటగాళ్ల క్వారంటైన్‌ను శ్రీలంక వైద్య ఆరోగ్య శాఖ ఏడు రోజులకు కుదించింది. అయితే జట్ల సహాయక సిబ్బంది మాత్రం తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో స్టార్ ప్లేయర్స్ గేల్, డుప్లెసిస్, ఆఫ్రిది, బ్రాత్‌వైట్‌లు కూడా ఆడనున్నారు.

Also Read: పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..

Loading...
Unable to load recommendations.
Follow Us