ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ కేఎల్ రాహుల్ (69 బంతుల్లో 132; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, రవి బిష్నోయి మూడేసి వికెట్లు పడగొట్టగా.. కాట్రేల్ రెండు వికెట్లు.. మాక్స్‌వెల్, షమీ చెరో వికెట్ తీశారు. (IPL 2020)
#KXIP are topping the charts in the Points Table after Match 6.#Dream11IPL #KXIPvRCB pic.twitter.com/T9gcCATZ40
— IndianPremierLeague (@IPL) September 24, 2020
No prizes for guessing who is our Man of the Match for Match 6 of #Dream11IPL.@klrahul11 #KXIPvRCB pic.twitter.com/ugxGioQNPV
— IndianPremierLeague (@IPL) September 24, 2020