జగనన్నే మాలాంటి వారికి స్ఫూర్తి- నిఖిల్ గౌడ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు, సినీ హీరో నిఖిల్ గౌడ కలిశారు. మంగళవారం జగన్ నివాసానికి వెళ్లిన నిఖిల్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించారు. వైఎస్ జగన్ వంటి నేతలు తనలాంటి యువతకు స్ఫూర్తి అంటూ.. ఫోటోలను యువ హీరో ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వైఎస్ జగన్ దాదాపు పదేళ్ల పాటూ చేసిన పోరాటం రాజకీయాల్లో ఉన్న యువతకు ఓ మోడల్‌గా […]

జగనన్నే మాలాంటి వారికి స్ఫూర్తి- నిఖిల్ గౌడ

Updated on: Jun 11, 2019 | 7:16 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు, సినీ హీరో నిఖిల్ గౌడ కలిశారు. మంగళవారం జగన్ నివాసానికి వెళ్లిన నిఖిల్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించారు. వైఎస్ జగన్ వంటి నేతలు తనలాంటి యువతకు స్ఫూర్తి అంటూ.. ఫోటోలను యువ హీరో ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

వైఎస్ జగన్ దాదాపు పదేళ్ల పాటూ చేసిన పోరాటం రాజకీయాల్లో ఉన్న యువతకు ఓ మోడల్‌గా తీసుకోవాలని నిఖిల్ అభిప్రాయపడ్డారు. ప్రజా సేవ కోసం పరితపిస్తూ.. ఓటమి ఎదురైనా భరిస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. చివరికి ప్రజల మన్ననలు పొందగలిగారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టి.. వారి అంచనాలను అందుకొని.. మన్ననలను పొందాలని ఆశిస్తున్నాను అన్నారు.

నిఖిల్ గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు. కన్నడలో హీరోగా పరిచయమైన నిఖిల్.. రెండు మూడు సినిమాలు చేశారు. అలాగే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ నిఖిల్ వెటరన్ హీరోయిన్ సుమలత అంబరీష్‌పై ఓటమి పాలయ్యారు.