భాగ్యనగరానికి మరో మణిహారం లాంటి ప్రాజక్టు

|

Nov 10, 2020 | 12:57 PM

భాగ్యనగరానికి మరో మణిహారం లాంటి ప్రాజక్టు వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో ఈ ఉదయం వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ కలిసి ఈ ప్లాంటును నెలకొల్పాయి. మునిసిపల్‌ వ్యర్థాలతో 9.8 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ ప్లాంటును నిర్మించాయి. దీనిద్వారా పర్యావరణానికి హాని లేకుండా రెఫ్యూజ్‌ డీరైవ్డ్‌ ఫ్యూల్‌, ఆర్‌డీఎఫ్ తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. […]

భాగ్యనగరానికి మరో మణిహారం లాంటి ప్రాజక్టు
Follow us on

భాగ్యనగరానికి మరో మణిహారం లాంటి ప్రాజక్టు వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో ఈ ఉదయం వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ కలిసి ఈ ప్లాంటును నెలకొల్పాయి. మునిసిపల్‌ వ్యర్థాలతో 9.8 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ ప్లాంటును నిర్మించాయి. దీనిద్వారా పర్యావరణానికి హాని లేకుండా రెఫ్యూజ్‌ డీరైవ్డ్‌ ఫ్యూల్‌, ఆర్‌డీఎఫ్ తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. బెల్జియంకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్లాంటును ఏర్పాటు చేశారు. మరోవైపు, త్వరలోనే 14.5 మెగావాట్ల సామర్థ్యంగల ఇలాంటిదే మరో ప్లాంటును దుండిగల్‌లోని టీఎస్‌ఐఐసీ స్థలంలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది.