KTR Appeals to US Firms to Invest in Telangana :పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ స్వర్గధామమని పరిశ్రమలు, ఐటీ శాఖ శాఖ మంత్రి కె.తారాక రామారావు అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ తెలంగాణలో అద్భుతమైన అవకాశాలున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తూ పెట్టుబడులకు సంపూర్ణ భరోసా కల్పిస్తోందని తెలిపారు. అమెరికా -భారత్ వాణిజ్య మండలి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ… ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధారపడుతున్నాయని అన్నారు. దేశంలో పెట్టుబడులకు ముందుకు వస్తే.. విదేశీ సంస్థలు భారత్‌ను ఒక యూనిట్‌గా కాకుండా తెంగాణలాంటి ప్రగతిశీల రాష్ట్రాలను యూనిట్‌గా తీసుకోవాలని పెట్టుబడుదారులను కోరారు.
వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న అమెరికా ప్రతినిధులు టీఎస్ఐపాస్‌లను అభినందించారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని యూఎస్ఐబీసీ అధ్యక్షురాలు నిషా బిస్వాల్ హామీ ఇచ్చారు.