మరో బాలీవుడ్ దంపతులు విడాకుల బాట పట్టారు. నటి..దర్శకురాలు కొంకణసేన్ శర్మ విడాకులకు దరఖాస్తు చేసింది. నటుడు రణ్ వీర్ షోరేను 2010లో పెళ్లాడింది. 2015లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించింది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. వీరిద్దరు విడిగా ఉంటూనే తనయుడి బాధ్యతలను చూసుకుంటున్నారు. 2015 నుండి వేరుగానే ఉంటోన్న వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కొంకణా తన సహనటుడు రణ్‌వీర్ షోరేను 2010లో వివాహం చేసుకుంది. ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘మిక్స్‌డ్ డబుల్స్’, ‘ఆజా నాచ్‌లే’ వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2007 నుంచి 2010 వరకూ సహజీవనం చేశారు. ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 2015లో వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ కౌన్సిలింగ్ తీసుకున్నా విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. మరో ఆరు నెలల్లో వీరికి విడాకులు మంజూరు కానున్నాయి.