తెలంగాణలో ఇప్పుడు ఆడియో ట్రెండ్ నడుస్తోంది. మొన్నటికి మొన్న ఎంపీ గరికపాటి పార్టీ ఎందుకు మారారో ఓ అభిమాని ఫోన్ కాల్‌లో వివరిస్తే.. ఇప్పుడదే పని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఆ కాల్‌లో పార్టీ మారుతున్నారా అని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. అవును త్వరలో అంటూ సమాధానం ఇచ్చారు రాజగోపాల్. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం తానేనంటూ ఆ అభిమానికి చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. ఇప్పుడు ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్. పదవులు లేదా పోజిషన్ ఆశించి బీజేపీలోకి వచ్చే వారికి నిరాశ తప్పదని స్పష్టం చేశారాయన. బీజేపీ సిద్ధాంతాలకు నిబద్ధమైన పార్టీ అని.. కుటుంబ పార్టీ కాదని చెప్పారు. ఈ రోజు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక ఆడియోకు స్పందనగా ఈ విషయం స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు కృష్ణసాగర్.