“అందుకు ఒప్పుకుంటే.. ఈ రాత్రే రాజీనామా చేస్తా”

|

Sep 08, 2020 | 9:37 PM

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కా మారింది.

అందుకు ఒప్పుకుంటే.. ఈ రాత్రే రాజీనామా చేస్తా
Follow us on

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడకుండా రాజకీయ పార్టీల అండతో అమరావతి జేఏసీ కోర్టులకు వెళ్లి స్టేలు తేవడంపై మంత్రి ఫైరయ్యారు. రాజధాని ప్రాంత రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదల గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ మాట్లాడిన క్లారిటీ ఇచ్చారు నాని. పేదల మనసు తెలిసిన వ్యక్తిగా, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని  మంత్రి పునరద్ఘాటించారు. మంత్రి పదవి తనకు పెద్ద లెక్కకాదని, జేఏసీ కేసుల వెనక్కి తీసుకుని..పేదలకు భూమి పట్టాలు ఇవ్వనిస్తే..ఈ రోజు రాత్రే రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి పేదల కంటే ఎక్కువ కాదన్న నాని, అది లేకపోయినా ప్రజల పక్షన నిలబడతానని తెలిపారు.

 

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !