ఇక పూర్తిస్థాయి కరోనా చికిత్సకోసం కింగ్‌కోఠి హాస్పిటల్..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స అందిస్తున్న కింగ్‌ కోఠి దవాఖానను ప్రభుత్వం పూర్తిస్థాయి కరోనా దవాఖానగా

ఇక పూర్తిస్థాయి కరోనా చికిత్సకోసం కింగ్‌కోఠి హాస్పిటల్..

Edited By:

Updated on: Jul 25, 2020 | 3:11 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స అందిస్తున్న కింగ్‌ కోఠి దవాఖానను ప్రభుత్వం పూర్తిస్థాయి కరోనా దవాఖానగా అప్‌గ్రేడ్‌ చేసింది. గాంధీలో ఇప్పటికే 2వేల పడకల సామర్థ్యం ఉండగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో 120 పడకలు ఉన్నాయి. ఇటీవలే గచ్చిబౌలిలో 1500 పడకల సామర్థ్యం గల టిమ్స్‌ వైద్యశాలను అందుబాటులోకి తెచ్చారు. అక్కడ 40మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.

కరోనా కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కింగ్‌ కోఠి దవాఖానలో 350పడకలను అందుబాటులో ఉంచింది. ప్రతి పడకకు త్రీ-లైన్‌ ఆక్సిజన్‌ సౌకర్యంతో పాటు 50 పడకల ఐసీయూ వార్డు అందుబాటులో ఉంది. దీంతోపాటు నల్లకుంటలోని ఫీవర్‌ హాస్పిటల్‌లో సైతం 100 పడకలతో ప్రత్యేక వార్డును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డీఎంఈ తెలిపారు. ఇప్పటికే ఫీవర్‌ వైద్యశాల ప్రత్యేక వార్డులో 28మంది కరోనా పాజిటివ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మొత్తం పడకల సంఖ్య 3,970కి పెరిగింది.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!