ఖమ్మంలో కాక రేపుతున్న ప్రొటోకాల్‌ వివాదం

|

Nov 09, 2020 | 5:40 PM

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. మధిరలో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఇందుకు వేదికగా మారింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండానే పని కానిచ్చేశారు.. ఇది కాస్తా ప్రొటోకాల్‌ వివాదానికి దారితీసింది.

ఖమ్మంలో కాక రేపుతున్న ప్రొటోకాల్‌ వివాదం
Follow us on

Madhira CCI Cotton Buying Center : ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మధిరలో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఇందుకు వేదికగా మారింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండానే పని కానిచ్చేశారు.. ఇది కాస్తా ప్రొటోకాల్‌ వివాదానికి దారితీసింది. సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్కను ప్రారంభోత్సవానికి పిలిచిన అధికారులు.. ఆయన రాకుండానే ఓపెనింగ్‌ చేయించారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌తో ప్రారంభోత్సవాన్ని జరిపించారు.

ఇది తెలియని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క..  అక్కడకు చేరుకున్నాక విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అక్కడ సీన్ మరింత హీట్ పెరుగుతుండటంతో ఎమ్మెల్యేకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. అధికారుల తీరును తప్పుపడుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు భట్టి తెలిపారు.

మొదట ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం ఉంటుందని ఎమ్మెల్యే భట్టికి అధికారులు సమాచారం అందించారు. తర్వాత మళ్లీ ఏపీ మార్కెటింగ్‌ శాఖ సెక్రెటరీ ఫోన్‌ చేసి 30 నిమిషాలు ఆలస్యంగా అంటే.. 11.30కు రిబ్బెన్‌ కటింగ్‌ను పెట్టుకుందామని చెప్పారు. సరేనన్న భట్టి అధికారులు చెప్పిన టైం వరకు అక్కడకు చేరుకునే సరికే ప్రారంభోత్సవం అయిపోయిందన్న విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.

అధికారులు సమాధానం చెప్పేయత్నం చేయగా.. వారించిన భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతోనే మాట్లాడుతానన్నారు. సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం ఓపెనింగ్‌ ఇలా వివాదాస్పదం కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.