ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం..! : ఎంపీ కేశినేని నాని

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ కేశినేని ఖండించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏపీ సీఎం జగన్‌ వద్దకు.. ప్రధాని వద్దకు.. మంత్రుల వద్దకైనా వెళ్తానని.. కానీ పార్టీ మారనని స్పష్టం చేశారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదని నాని అన్నారు. హోదా కోసం తాము అన్ని విధాలా పోరాటం చేసి విఫలమయ్యామన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పినందునే ఆయనను ప్రజలు నమ్మారని […]

ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం..! : ఎంపీ కేశినేని నాని

Edited By:

Updated on: Jun 21, 2019 | 9:01 AM

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ కేశినేని ఖండించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏపీ సీఎం జగన్‌ వద్దకు.. ప్రధాని వద్దకు.. మంత్రుల వద్దకైనా వెళ్తానని.. కానీ పార్టీ మారనని స్పష్టం చేశారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదని నాని అన్నారు. హోదా కోసం తాము అన్ని విధాలా పోరాటం చేసి విఫలమయ్యామన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పినందునే ఆయనను ప్రజలు నమ్మారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ పొర్లుదండాలు పెట్టి.. తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని కేశినేని వ్యాఖ్యలు చేశారు.