వినాశకరమైన వరదల వల్ల ప్రభావితమైన కేరళ రాష్ట్రం ఇడుక్కిలో రాజమాల కొండచరియల్లో మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. నేడు మరో మూడు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకోగా మరణించిన వారి సంఖ్య మంగళవారం 52కు పెరిగింది. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ జట్లు, ఇడుక్కి ఫైర్ అండ్ రెస్క్యూ టీం, కొట్టాయం, తిరువనంతపురం నుంచి ఒక్కో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలు ఇడుక్కి రాజమాలాలో సహాయక చర్యలు చేపడుతున్నాయని జిల్లా సమాచార కార్యాలయం ఆదివారం తెలిపింది.
కాగా.. మృతుల బంధువులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసి, జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి.
Read More:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..