లాక్ డౌన్ వేళ.. సడలింపులను సవరించిన కేరళ..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించైనా విషయం తెలిసిందే. కోవిడ్ -19 లాక్‌డౌన్ మార్గదర్శకాలలో కొన్ని సడలింపులపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేరళ

లాక్ డౌన్ వేళ.. సడలింపులను సవరించిన కేరళ..

Edited By:

Updated on: Apr 20, 2020 | 6:57 PM

Kerala: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించైనా విషయం తెలిసిందే. కోవిడ్ -19 లాక్‌డౌన్ మార్గదర్శకాలలో కొన్ని సడలింపులపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేరళ ప్రభుత్వం దిగొచ్చింది. నగరాల్లో బస్సులు నడపడం, రెస్టారెంట్లు తెరవడం, ద్విచక్ర వాహనాలపై డబుల్ రైడింగ్‌ను అనుమతించకూడదని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.

కాగా.. చీఫ్ సెక్రటరీ టామ్ జోస్‌తో ఈ ఉదయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నట్టు తెలిపారు. బస్సులు, రెస్టారెంట్లను అనమతించడం లేదని, బార్బర్ షాపులకు కూడా అనుమతి లేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, పార్సిల్ సర్వీసులకు మాత్రం అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు.. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఈ నెల 15న విడుదల చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాలను బలహీనం చేసేలా కేరళ ప్రభుత్వం అదనపు సడలింపు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సడలింపుల్లో కొన్ని సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.