శబరిమల భక్తులకు మార్గదర్శకాలు ఇవే …

|

Oct 15, 2020 | 11:03 PM

శబరిమల యాత్రకు కొత్త మార్గదర్శనాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయాలు అంటూ ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ...

శబరిమల భక్తులకు మార్గదర్శకాలు ఇవే ...
Follow us on

New Guidelines for The Sabarimala Yatra : శబరిమల యాత్రకు కొత్త మార్గదర్శనాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయాలు అంటూ ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా కోరారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

వారిటి ప్రకారం అక్కడి ప్రభుత్వ జారీ చేసిన నిబంధనలు ఇలా ఉన్నాయి.

  •  ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌ లింక్‌ను అందించారు.
  • వారం ప్రారంభంలో రోజుకు 1000 మంది, వారాంతాల్లో రోజుకు 2000 మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే వీలు కల్పించారు.
  • దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్‌ వచ్చిన వారినే అనుమతిస్తారు.
  • పది సంవత్సరాలలోపు వారికి, 60-65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.
  • శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది.
  • స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.
  • కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు.