కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. తెరపైకి మరో ‘దొంగ’….. రూ.26 లక్షలు ఏమయ్యాయబ్బా ?

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2020 | 5:26 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో 'అదృశ్య దొంగ' తెరపైకి వచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురిలో ఇద్దరు..స్వప్న సురేష్, సందీప్ నాయర్  కేరళ నుంచి పారిపోబోతూ.. రూ. 40 లక్షలతో కూడిన ఓ బ్యాగును మాజీ జువెల్లర్ ఒకరికి..

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. తెరపైకి మరో దొంగ..... రూ.26 లక్షలు ఏమయ్యాయబ్బా ?
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ‘అదృశ్య దొంగ’ తెరపైకి వచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురిలో ఇద్దరు..స్వప్న సురేష్, సందీప్ నాయర్  కేరళ నుంచి పారిపోబోతూ.. రూ. 40 లక్షలతో కూడిన ఓ బ్యాగును మాజీ జువెల్లర్ ఒకరికి ఇచ్చారట. అయితే అది అతడినుంచి ఈ కేసులో మొదటి నిందితుడైన సరిత్ ఇంటికి చేరింది. కస్టమ్స్ అధికారులు అతని ఇంటిని సోదా చేసి ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో రూ. 14 లక్షలే కనిపించాయి. మరి 26 లక్షల ఆచూకీ తెలియలేదు. సరిత్ ఇంటికి ఈ సంచిని తరలించే ముందు ఎవరో ఈ సొమ్మును నొక్కేసినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ జువెల్లర్ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. స్వప్న సురేష్, ఆమె భర్త, వారి ఇద్దరు పిల్లలు..సందీప్ నాయర్ తో కలిసి ఓ హోటల్లో బస చేశారని, సరిత్ అరెస్టయ్యాక.. బెంగుళూరు లో ఉన్న వీరి ఆచూకీ కూడా తెలిసిందని అంటున్నారు.