కేరళలో సంచలన సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్నకు .. సీఎం ఆఫీసుతో లింకులు ఉన్నట్లు ఇవాళ ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో స్వప్న బెయిల్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో.. ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఎన్ఐఏ తరపున కోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ విజయ్‌కుమార్ మాట్లాడారు. సోమవారం రోజున స్వప్న బెయిల్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనున్నది. సీఎం ఆఫీసులో పనిచేసిన మాజీ సీఎస్ శివశంకర్‌తో స్వప్నకు లింకులు ఉన్నట్లు సోలిసిటర్ జనరల్ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి స్పేస్ పార్క్‌లో స్వప్నకు మాజీ సీఎస్ శివకుమార్ ఉద్యోగం ఇప్పించారని ఎన్ఐఏ కోర్టుకు తెలియజేశారు.