మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్న’మహానటి’.. ఆ హీరో సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్న కీర్తిసురేష్

'మహానటి' సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. ఆ సినిమా తరవాత ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ చిన్నది ఇటీవల వరుసగా లేడీఓరిఎంటేడ్ సినిమాలు చేసింది.

మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్న'మహానటి'.. ఆ హీరో సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్న కీర్తిసురేష్
ప్రస్తుతం తెలుగులోసూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నాయికగా ఆమె 'సర్కారువారి పాట' చేస్తోంది. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2020 | 11:33 AM

‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. ఆ సినిమా తరవాత ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ చిన్నది ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది కీర్తి. వాటిలో ‘పెంగ్విన్’ సినిమా ఫ్లాప్ అవ్వగా ‘మిస్ ఇండియా’ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’వేదాళం’ రీమేక్ లో చిరు చెల్లిగా కీర్తిసురేష్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో మెగా హీరో సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ఛాన్స్ దక్కించుకుందని టాక్ నడుస్తుంది.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా కారణంగా మూతపడిన థియేటర్స్ తెరుచుకోవడంతో ముందుగా విడుదలవుతున్న టాలీవుడ్ సినిమా’సోలో బ్రతుకే సో బెటర్’‌. డిసెంబర్ 25న సినిమా థియేటర్స్‌లో రానుంది. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలు కమిట్ అయ్యాడు తేజ్. ఒక సినిమా దేవకట్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. మరో సినిమాను కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనున్నారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC