పాత్రలకు తగ్గట్టుగా కొన్నిసార్లు బోల్డ్‌గా నటించాలి.. ఏది చేసినా అదంతా నటనలో భాగమే అంటోన్న..

ఒకే రకమైన మూస పాత్రలు చేయడం తనకు ఇష్టముండదని చెబుతోంది గ్లామర్ క్వీన్ లక్ష్మీరాయ్‌.

పాత్రలకు తగ్గట్టుగా కొన్నిసార్లు బోల్డ్‌గా నటించాలి.. ఏది చేసినా అదంతా నటనలో భాగమే అంటోన్న..
Follow us
uppula Raju

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 13, 2020 | 12:22 PM

ఒకే రకమైన మూస పాత్రలు చేయడం తనకు ఇష్టముండదని చెబుతోంది గ్లామర్ క్వీన్ లక్ష్మీరాయ్‌. తన అందచందాలతో యువతను పిచ్చెక్కించే లక్ష్మీరాయ్‌ తెలుగు, తమిళ భాషల్లో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నటన గురించి తన మనసులోని మాటలను ప్రస్తావించింది.

కథానాయికగా తన దృష్టిలో గ్లామర్‌ పాత్రలు, అభినయ ప్రధాన పాత్రలు అనే భేదాలేవి లేవు. పాత్ర ఏదైనా దానికోసం నేను పడే కష్టంలో ఏ విధమైన మార్పు ఉండదు’ అని చెబుతోంది. ‘గ్లామర్‌ పాత్రల్లో తక్కువ శ్రమ, నటనకు ఆస్కారమున్న పాత్రల్లో ఎక్కువ కష్టం ఉంటుదనేది పూర్తిగా అబద్ధం. సినిమా ఏదైనా నటన విషయంలో ఏ విధమైన తేడా వుండదు. అందాల ప్రదర్శనకో, అభినయ ప్రధాన పాత్రలకో పరిమితవడానికి నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదని స్పష్టం చేసింది. కొన్నిసార్లు పాత్రలకు తగినట్లుగా బోల్డ్‌గా నటించాల్సి వస్తుంది. నాయికగా ఏం చేసినా అదంతా నటనలో ఓ భాగం మాత్రమే అని చెప్పుకొచ్చింది. కొంతకాలంగా తెలుగు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ తమిళ, మలయాళ చిత్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది.