శివుడి జ్యోతిర్లింగం… కేదార్‌నాథ్ ఆలయం!

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చార్‌ధామ్ యాత్రను ప్రారంభించి.. పైన పేర్కొన్న క్రమంలో బద్రీనా‌థ్‌తో ముగిస్తారు. ఈ కేదార్ నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది. గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు. ఇదొక […]

శివుడి జ్యోతిర్లింగం... కేదార్‌నాథ్ ఆలయం!
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 4:17 PM

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చార్‌ధామ్ యాత్రను ప్రారంభించి.. పైన పేర్కొన్న క్రమంలో బద్రీనా‌థ్‌తో ముగిస్తారు. ఈ కేదార్ నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది. గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు. ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం. సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంటుంది. దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. మరి ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్ నాథ్ యాత్రకు పయనమవుతారు. గంగోత్రి నుండి ఉత్తర కాశీ మీదుగా వాహనాల్లో రుద్రప్రయాగ చేరుకోవచ్చు. కేదార్ నాథ్ వెళ్లే వార్గంలో మోటార్ వాహనాలు వెళ్ళగల చివరి ప్రదేశం గౌరీకుండ్. ఇక్కడి నుండి నడిచి లేదా గుర్రాల మీదగానీ కేదార్ నాథ్ కు చేరుకోవచ్చు. గౌరీ కుండ్ నుండి కేదార్ నాథ్ కు సుమారు 14 కి.మీ దూరం.

కేదార్ నాథ్ జ్యోతిర్లింగం  

దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్. కేదార్ నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్ నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది.

ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది. తిరిగి వ్రుశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వ్రుశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మసి వేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో గాని, నవంవబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.

పురాణాల ప్రకారం

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. నరనారయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు చేసినప్పుడు ద్యోతకముయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగంను దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయాల్లో కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగను ఉంచి ఆరాధచేస్తుండేవారు. మట్టితో చేసి ఈ శివలింగంను వారు సాక్షాత్తు ఈశ్వరుడని అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు, అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగంకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు వారు స్వామీ ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయ పర్వతశ్రుంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.

అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది

అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతున్నది. కేదార్ నాథ్ ఆలయం ఆది శంకరులచే 8వ శతాబ్దంలో పేనర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు.

పూజలు

కేదారేశ్వరస్వామి రెండు సార్లు రెండు విధాలుగా పూజింపబడుతాడు. ఉదయం బాలభోగ్ అష్టోత్తరం, మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు. ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణపూజ అంటారు. కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు అయిదు గంటల మధ్య తెరుస్తారు.సాయంత్రం జరిగే పూజను శ్రుంగార పూజ అంటారు. సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామి వారిని అందమైన పూలతో అలంకరిస్తారు. కేదార్ నాథ్ లో 4 లేక 5 గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. కేదారేశ్వరస్వామి వారికి 6గంట నుండి 7గంటల వరకు విశేష హారతిని ఇస్తారు. ఆలయం లోపల హారతిని ఇస్తుంటే, ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు. రాత్రి సమయంన స్వామివారికి అర్చనలు ఉండవు. అలంకార మూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభిస్తుంది.

ఎలా వెళ్ళాలి

వాయుమార్గం

కేదార్ నాథ్ కు సమీప ఎయిర్ పోర్టు సుమారు 183 కి. మీ. ల దూరం లోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్టు నుండి రుద్రప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

రైలు మార్గం

కేదార్ నాథ్ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి. అయితే 24 కి.మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం

కేదార్ నాథ్ కు నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి.

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..