దుమ్మురేపుతున్న ‘కౌన్‌ హే అచ్చా..’ సాంగ్.. రామ్ ‘రెడ్’ మూవీ నుంచి సమాజంపైకి ఎక్కుపెట్టిన బాణం

కొన్ని నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి. అందులోనూ మ‌న హీరోలు వాటి గురించి మ‌రింత గ‌ట్టిగా చెబుతున్న‌ప్పుడు... ఆ భావాలు శ్రోతల గుండెల్లోకి నేరుగా చొచ్చుకుని పోతుంటాయి.

దుమ్మురేపుతున్న 'కౌన్‌ హే అచ్చా..' సాంగ్.. రామ్ 'రెడ్' మూవీ నుంచి సమాజంపైకి ఎక్కుపెట్టిన బాణం
Follow us

|

Updated on: Dec 15, 2020 | 2:59 PM

కొన్ని నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి. అందులోనూ మ‌న హీరోలు వాటి గురించి మ‌రింత గ‌ట్టిగా చెబుతున్న‌ప్పుడు… ఆ భావాలు శ్రోతల గుండెల్లోకి నేరుగా చొచ్చుకుని పోతుంటాయి. రీసెంట్ టైమ్స్ లో అలా జ‌నాల్లోకి వెళ్లిందే `కౌన్‌ హే అచ్చా… కౌన్ హే లుచ్చా…` అనే పాట‌. రామ్ న‌టించిన ‘రెడ్’ సినిమాలోని పాట ఇది. రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ ని రాబ‌ట్టుకుంటోంది. ఈ పాట గురించి రీసెంట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ `థీమ్ అదిరింది` అంటూ ట్విట్ట‌ర్‌లో స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేశారు. అంత‌గా ప్రజాద‌ర‌ణ పొందిన ఈ పాట గురించి `రెడ్‌` టీమ్ స్పందించింది.

చిత్ర ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల మాట్లాడుతూ “సినిమాలో హీరో కేర‌క్ట‌ర్ ఎలివేష‌న్ కోసం సంద‌ర్భానుసారంగా వ‌చ్చే పాటే ‘కౌన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా’. గేయ ర‌చ‌యిత క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి సంద‌ర్భాన్ని వివ‌రించగానే ప‌ర్ఫెక్ట్ గా రాసిచ్చారు. ప్ర‌తి లైను బావుందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. స‌న్నిహితులు కూడా చాలా మంది ఫోన్లు చేసి, మాన‌వ నైజాన్ని అద్భుతంగా చెప్పారంటున్నారు. మ‌ణిశ‌ర్మ‌గారి బాణీని అనురాగ్ కుల‌క‌ర్ణి అద్భుతంగా సొంతం చేసుకుని పాడారు. ఆయ‌న స్వ‌రం పాట‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తెచ్చిపెట్టింది. `రెడ్‌` నుంచి విడుద‌లైన ప్ర‌తి పాట‌నూ ప్రేక్ష‌కులు ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది“ అని అన్నారు.

నిర్మాత స్ర‌వంతి ర‌వికిశోర్ మాట్లాడుతూ “రెడ్ నుంచి ఏ పాట విడుద‌లైనా ప్రేక్ష‌కులు చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌గారి స్వ‌రాల‌కు ఎంత గొప్ప ఆద‌ర‌ణ ఉంటుందో మ‌రోసారి ప్రూవ్ అయింది. ఇంత‌కు ముందు రిలీజ్ చేసిన `డించ‌క్ డించ‌క్‌…`, `నువ్వే నువ్వే` పాట‌ల‌కు కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్పుడు `కౌన్ హే అచ్చా… ` పాట‌కు గొప్ప స్పంద‌న వ‌స్తున్నందుకు యూనిట్ అంతా ఆనందంగా ఉంది. `రెడ్‌`కి సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాం. రామ్ నుంచి ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో… దానికి త‌గ్గ‌ట్టు ఉంటుంది సినిమా“ అని చెప్పారు.

Also Read : ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?