కర్నూలు జిల్లా గూడూరు వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు అర్ధరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి పిల్లా, పెద్దా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లిస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రతువును తిలకించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చి భక్తిప్రపత్తుల్ని చాటుకున్నారు.