కొద్ది రోజుల్లోనే మంచి పాపులర్టీనీ సంపాదించుకుంది ‘కార్తీక దీపం’ సీరియల్. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర అన్ని సీరియలో కల్లా ఇదే రేటింగ్స్‌లో ఫస్ట్ నిలుస్తోంది. సాయంత్రం 7.30 గంటలు అయ్యిందంటే.. అందరూ టీవీల ముందు తప్పనిసరి కూర్చోవల్సిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సీరియల్‌కి ఆప్ట్ అయి పోయారు.
ఒక రోజు మిస్ అయినా.. హాట్‌స్టార్, యూట్యూబ్‌లలో చూసేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోల ప్రోగ్రామ్స్, సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో కార్తీక దీపం సీరియల్‌తో పోటీపడలేకపోతున్నాయి. తొందరగా దీప, కార్తిక్‌లు కలవాలని.. దేవుళ్లని కూడా మొక్కుకుంటున్నారు ప్రేక్షకులు. తన నటనతో అందరి హృదయాలను ఆకట్టుకుంటోన్న వంటలక్కకి ఇప్పుడు పోటీ రానుందా? ఓ టాప్ హీరోయిన్ వంటలక్కతో పోటీకి దిగనున్నారా? అంటే అవే సూచనలు కనిపిస్తున్నాయి.
స్టార్ మా సీరియల్‌లో ‘ఇంటింటీ గృహలక్ష్మి’ అనే కొత్త సీరియల్ ప్రసారం అవుతోంది. ‘అన్నమయ్య’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన కస్తూరీ.. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మధ్యలో బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు ఈ సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చారు. అందులోనూ టాప్ హీరోయిన్ టీవీలో కనిపిస్తే ఎవరు చూడకుండా ఉంటారు.
ఇప్పటికే ఈ సీరియల్ గురించి చర్చలు మొదలయ్యాయి. ‘చదువురాని ఓ అమాయకపు మహిళ.. తన భర్త, పిల్లలపై చూపించే ప్రేమ ఎలా ఉంటుంది?’ అనే కథతో ఈ సీరియల్ స్టార్ట్ అయింది. అయితే తన భర్త పీఏతో సన్నిహితం కావడం.. తెలియని కస్తూరి.. అతడు, తన పిల్లలే లోకమే ఊహల్లో జీవిస్తూ ఉంటుంది. కాగా.. మొదలైన కొద్ది రోజులకే మంచి టాక్‌ని, రేటింగ్‌ని సంపాదించుకుంది గృహలక్ష్మీ సీరియల్. ఇలానే కథ సాగుతూ ఉంటే.. వంటలక్కకి పోటీగా.. ఈ సీరియల్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.