కర్ణాటకలో కరోనా కలకలం.. ఒక్కరోజులో 2,627 కేసులు, 71 మరణాలు..

| Edited By:

Jul 13, 2020 | 12:54 AM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత కర్ణాటకలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో

కర్ణాటకలో కరోనా కలకలం.. ఒక్కరోజులో 2,627 కేసులు, 71 మరణాలు..
Follow us on

Coronavirus in Karnataka: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత కర్ణాటకలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 2,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,843కు చేరింది.

ఇక కోవిద్-19 మరణాల సంఖ్య కూడా కర్ణాటకను హడలెత్తిస్తోంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 71 మంది మృతి చెందారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 684కు చేరింది. ఇవాళ ఒక్కరోజే కర్ణాటకలో 693 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 15,409 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 532 మంది కరోనా రోగులు కర్ణాటకలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.