లాక్‌డౌన్ సడలింపులతో.. భారీగా పెరిగిన కరోనా కేసులు..

| Edited By:

May 19, 2020 | 3:12 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా కేసులు లక్ష దాటాయి. ఈ వైరస్ ధాటికి కర్ణాటకలో కొత్తగా 127 కోవిద్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్ర 5 గంటల నుంచి

లాక్‌డౌన్ సడలింపులతో.. భారీగా పెరిగిన కరోనా కేసులు..
Follow us on

Karnataka records highest single-day spike: కోవిద్-19 విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా కేసులు లక్ష దాటాయి. ఈ వైరస్ ధాటికి కర్ణాటకలో కొత్తగా 127 కోవిద్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్ర 5 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను ‘మిడ్ డే’ బులెటిన్ పేరుతో కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది.

కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1373 పాజిటివ్ కేసులు ఉండగా, అందులో 802 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 530 మంది డిశ్చార్జ్ అయ్యారని, 41 మంది మరణించారని కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. 41 మరణాల్లో ఒకటి మాత్రం కోవిద్-19తో సంబంధం లేదని పేర్కొంది. కర్ణాటకలో లాక్‌డౌన్ నిబంధనలను భారీగా సడలించడంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం.

Also Read: గుడ్ న్యూస్: కరోనాపై పోరులో మరో ముందడుగు.. ట్రయల్స్ సక్సెస్!