దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమ, కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక గుడిలో పూజలు నిర్వహించారు దేవినేని ఉమా. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. నాపై చూపిస్తున్న ఈ ప్రజాదారణకు నేను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి మైలవరాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత హామీలన్నీ తప్పకుండా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు దేవినేని ఉమా.