విషాదం: ప్రముఖ బుల్లితెర నటుడు హఠాన్మరణం!

Kannada TV Actor Passes Away: గత కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. తాజాగా కన్నడ బుల్లితెర నటుడు, హోస్ట్ సంజీవ్ కులకర్ణి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అకాల మరణం చెందారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ సీరియల్స్ నాగిని.. రాజారాణి.. ఏటు-ఎదురీతతో సంజీవ్ కులకర్ణి ప్రేక్షకులకు సుపరిచితుడు. కొద్దికాలంగా ఆయన కార్డియోమయోపతితో బాధపడుతున్నారు. దీనికి నారాయణ హృదయాలయలో […]

విషాదం: ప్రముఖ బుల్లితెర నటుడు హఠాన్మరణం!

Edited By:

Updated on: Jan 27, 2020 | 2:30 PM

Kannada TV Actor Passes Away: గత కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. తాజాగా కన్నడ బుల్లితెర నటుడు, హోస్ట్ సంజీవ్ కులకర్ణి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అకాల మరణం చెందారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

ప్రముఖ కన్నడ సీరియల్స్ నాగిని.. రాజారాణి.. ఏటు-ఎదురీతతో సంజీవ్ కులకర్ణి ప్రేక్షకులకు సుపరిచితుడు. కొద్దికాలంగా ఆయన కార్డియోమయోపతితో బాధపడుతున్నారు. దీనికి నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. సంజీవ్ కులకర్ణి కుమారుడు సౌరభ్ కూడా నటుడే.

ఇక ప్రతీ నెలా సంభ్రమ- సౌరభ పేరుతో సంజీవ్ కులకర్ణి ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చేవారు. కాగా, ఆయన మరణవార్త విన్న పలువురు టీవీ, సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.