ఇది రీల్ సీన్ కాదు, రియల్ సీన్. మూవీలో హీరోయిన్‌గా నటిస్తోన్న నటి, ఆ చిత్ర దర్శకుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ చేేస్తుండగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకుంటోన్న విజయలక్ష్మీ తన తాజా ఫిల్మ్ ‘తుంగభద్ర’ మూవీ దర్శకుడు ఆంజనేయతో కలిసి పారిపోయింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే దర్శకుడు, హీరోయిన్ […]
Follow us on
ఇది రీల్ సీన్ కాదు, రియల్ సీన్. మూవీలో హీరోయిన్‌గా నటిస్తోన్న నటి, ఆ చిత్ర దర్శకుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ చేేస్తుండగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకుంటోన్న విజయలక్ష్మీ తన తాజా ఫిల్మ్ ‘తుంగభద్ర’ మూవీ దర్శకుడు ఆంజనేయతో కలిసి పారిపోయింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే దర్శకుడు, హీరోయిన్ మధ్యలోనే వెళ్లిపోవడంతో.. ఇప్పుటివరకు సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బంతా వేస్ట్ అయ్యిందని నిర్మాత వర్రీ అవుతున్నాడు. ఆ డబ్బంతా హీరోయిన్ తల్లీదండ్రులే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.
పోయినవారం రాయ్‌చూర్‌లో మూవీ షూటింగ్ ప్రాంతం నుంచి ఈ కపుల్ ఎస్కేప్ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక ఇటివలే నటి విజయలక్ష్మీ బామ్మ కన్నుమూశారు. ఆమె తల్లి కూడా ఆనారోగ్యంతో సతమతమౌతుంది. ఈ విషయాలు తెలిసి కూడా విజయలక్ష్మీ ఇంటివైపు కన్నెత్తి చూడలేదు. కట్ చేస్తే ఈ లవ్ కపుల్ రాయ్‌చూర్ ఎస్పీ ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలంటూ ఆయనకు మొర పెట్టుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించారు. అయితే నటి కంటే దర్శకుడు వయస్సు చాలా ఎక్కువగా కనిపిస్తోంది.