KGF 2 Movie Teaser: కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తానన్న మేకర్స్.. ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. మొదటి భాగానికి ఇది 2.0 వెర్షన్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. మొత్తం ట్రైలర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇస్తుంది. కాగా, కేజీఎఫ్ మొదటి భాగం అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండెన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ కేజీఎఫ్ 2పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయడంతో.. 2021 జూలై 30న కేజీఎఫ్2 ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
A promise was once made, that promise will be kept!https://t.co/Bmoh4TQLg8
Wishing Rocking Star @TheNameIsYash a very Happy Birthday.#KGF2Teaser #HBDRockyBhai @VKiragandur @prashanth_neel @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84
— Prashanth Neel (@prashanth_neel) January 7, 2021