బెంగుళూరులో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి

|

Aug 07, 2020 | 5:42 PM

బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శరణ్య - బెంగళూరులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరేసుకొని మృతి చెందింది. దీంతో పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భర్త రోహిత్ చంపి ఉంటాడని.. అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు బలైందని తల్లిదండ్రుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బెంగుళూరులో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి
Follow us on

బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శరణ్య – బెంగళూరులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరేసుకొని మృతి చెందింది. దీంతో పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భర్త రోహిత్ చంపి ఉంటాడని.. అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు బలైందని తల్లిదండ్రుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డికి చెందిన శరణ్య, రోహిత్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఏడాది కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా మద్యానికి బానిసై రోహిత్ బార్య శరణ్య వేధించడం మొదలుపెట్టాడు. భర్త అరాచకాలను భరించలేక శరణ్య తల్లిగారింటికి వచ్చేసింది. భర్తతో విడాకులు తీసుకునేందుక కోర్టు మెట్లు కూడా ఎక్కింది శరణ్య. అయితే, కుటుంబసభ్యులు ఇద్దరికి సర్ధిచెప్పి కాపురానికి పంపించారు. ఇకపై బాగా చూసుకుంటానని, వేధించనని పెద్దలు, కోర్టు సమక్షంలో ఒప్పుకొన్నాడు రోహిత్‌. 3 నెలల కిందట శరణ్యను బెంగళూరు తీసుకెళ్లి కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో శరణ్య చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. శరణ్య మరణవార్త తెలియగానే శరణ్య తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పేరెంట్స్‌ వెంటనే బెంగళూరు బయలుదేరి వెళ్లారు. శరణ్య చావుకు కారణమైన అల్లుడు రోహిత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.