‘ఐటమ్’వివాదం, సుప్రీంకోర్టుకెక్కిన కమల్ నాథ్

తన ఐటమ్ వ్యాఖ్యపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సుప్రీంకోర్టుకెక్కారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో తన స్టార్ క్యాంపెయినర్  హోదాను ఈసీ  రద్దు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. అయితే ఇది ఒక పోస్టా లేక హోదానా అన్నదానిపై తాను వ్యాఖ్యానించబోనని, ఈ నెల 10 తరువాతే   కామెంట్ చేస్తానని ఆయన అన్నారు. కేవలం  ఒక పదం ఇంత రచ్చ చేయడం రాజకీయాల్లో […]

ఐటమ్వివాదం, సుప్రీంకోర్టుకెక్కిన కమల్ నాథ్

Edited By:

Updated on: Oct 31, 2020 | 8:05 PM

తన ఐటమ్ వ్యాఖ్యపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సుప్రీంకోర్టుకెక్కారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో తన స్టార్ క్యాంపెయినర్  హోదాను ఈసీ  రద్దు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. అయితే ఇది ఒక పోస్టా లేక హోదానా అన్నదానిపై తాను వ్యాఖ్యానించబోనని, ఈ నెల 10 తరువాతే   కామెంట్ చేస్తానని ఆయన అన్నారు. కేవలం  ఒక పదం ఇంత రచ్చ చేయడం రాజకీయాల్లో ఇదే మొదటిసారని అంటున్నారు.

 

 

Follow Us