కమల్ నాథ్ పై ఈసీ ఆగ్రహం, ఆ వ్యాఖ్యపై వివరణ ఇవ్వాలని ఆదేశం
మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన ‘ఐటమ్’ కామెంట్ ఆయనను చిక్కుల్లో పడేస్తోంది. ఈ ఐటమ్ ఆంటే ఏమిటో 48 గంటల్లోగా వివరించాలని ఎన్నికల కమిషన్ ఆయనను ఆదేశించింది. కమల్ నాథ్ వ్యాఖ్యపై పార్టీ నేత రాహుల్ గాంధీ దురదృష్టకరమని ఖండించినప్పటికీ, అది ఆయన అభిప్రాయమని నాథ్ తేలిగ్గా తీసిపారేశారు. తన వ్యాఖ్య వల్ల ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, […]
మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన ‘ఐటమ్’ కామెంట్ ఆయనను చిక్కుల్లో పడేస్తోంది. ఈ ఐటమ్ ఆంటే ఏమిటో 48 గంటల్లోగా వివరించాలని ఎన్నికల కమిషన్ ఆయనను ఆదేశించింది. కమల్ నాథ్ వ్యాఖ్యపై పార్టీ నేత రాహుల్ గాంధీ దురదృష్టకరమని ఖండించినప్పటికీ, అది ఆయన అభిప్రాయమని నాథ్ తేలిగ్గా తీసిపారేశారు. తన వ్యాఖ్య వల్ల ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఇంకా క్షమాపణ ఎందుకని ఆయన పేర్కొన్నారు. ఎవరినీ అవమానపరచాలన్నది తన ఉద్దేశం కాదన్నారు.