జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలపై స్పందించిన కమల్

|

Aug 27, 2020 | 9:00 PM

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలపై చర్చ జరుగుతోంది. కరోనాతో దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్‌ 1 నుంచి జరిగే జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ కూడా రియాక్ట్ అయ్యారు. పరీక్షలు వాయిదా వేయడమే సరైన నిర్ణయమని అభిప్రాయపడుతూ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు నేటి తరాన్ని, వారి ఎంపికలను విస్మరించేలా ఉండటం […]

జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలపై స్పందించిన కమల్
Follow us on

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలపై చర్చ జరుగుతోంది. కరోనాతో దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్‌ 1 నుంచి జరిగే జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ కూడా రియాక్ట్ అయ్యారు. పరీక్షలు వాయిదా వేయడమే సరైన నిర్ణయమని అభిప్రాయపడుతూ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు నేటి తరాన్ని, వారి ఎంపికలను విస్మరించేలా ఉండటం తప్పిదమే అవుతుందని  అన్నారు. రేపటి పాలకులైన విద్యార్థుల మానసిక స్థితిని అర్థంచేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం క్షమించరాని నేరమంటూ విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, సామాజిక ఉద్యమకారులు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలోనూ ఏడు రాష్ట్రాల సీఎంలు ఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. ఒకవేళ కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి.. సమైక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలు వాయిదా వేసే యోచనలో ఉన్నట్టు కనబడటంలేదు. ఇప్పటికే విద్యార్థులకు అడ్మిట్‌ కార్డులను జారీ చేయగా.. నీట్‌కు దాదాపు 10లక్షల మంది, జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు ఏడున్నర లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.