అఫీషియల్: అక్టోబర్ 30న కాజల్- గౌతమ్‌ల పెళ్లి..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి పీటలెక్కబోతోంది. అక్టోబర్ 30వ తేదీన గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లాడబోతోంది.

అఫీషియల్: అక్టోబర్ 30న కాజల్- గౌతమ్‌ల పెళ్లి..

Updated on: Oct 06, 2020 | 1:11 PM

Kajal- Gautam Marriage: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి పీటలెక్కబోతోంది. అక్టోబర్ 30వ తేదీన గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లాడబోతోంది. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

”నేను ఎస్ చెప్పాను. అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానని మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మేము ఇద్దరం కలిసి కొత్త జీవితాలను ప్రారంభించబోతుండటం సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నా. ఇన్నేళ్ళుగా మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఇంకా అలరిస్తూనే ఉంటాను ” అని కాజల్ పేర్కొంది.

కాగా లక్ష్మీ కళ్యాణంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటివరకు తెలుగు, తమిళ్‌, హిందీలో దాదాపుగా 60 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాం ముంబయి సాగా, దుల్కర్ సల్మాన్‌ హే సినామిక చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.