సలహాదారుపదవికి కె.రామచంద్రమూర్తి రాజీనామా

ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు కె.రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయకల్లంకు రాజీనామా పత్రాన్ని అందించారు. వ్యక్తిగత కారణాల రీత్యా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాజీనామా...

సలహాదారుపదవికి కె.రామచంద్రమూర్తి రాజీనామా

Updated on: Aug 25, 2020 | 6:47 PM

ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు కె.రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయకల్లంకు రాజీనామా పత్రాన్ని అందించారు. వ్యక్తిగత కారణాల రీత్యా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాజీనామా పత్రంలో రామచంద్రమూర్తి పేర్కొన్నారు.
గత ఏడాది నవంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా నియమించింది.

సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఆయనకు ఛాంబర్‌ను కేటాయించారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు, అధ్యయనం చేసేందుకు నియమించినప్పటికీ ఆయనకు ఇప్పటి వరకూ ఒక్క దస్త్రం కూడా రాకపోవడంతోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్ట్, ఆయన పలు పత్రికలకు ప్రధాన సంపాదకులుగా పని చేశారు. రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. వీరిలో పది మందికి కేబినెట్‌ హోదా కూడా ఉంది.