చిట్‌ఫండ్ కేసు విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:42 PM

దిల్లీ: శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్‌ అధికారులు సహకరించడం లేదంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ కేసుపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. బుధవారం వాదనలు వినాల్సి ఉంది. కానీ జస్టిస్‌ నాగేశ్వరరావు దీనిపై విముఖత వ్యక్తం చేయడంతో కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేశారు. గతంలో బెంగాల్‌ ప్రభుత్వం తరఫున […]

చిట్‌ఫండ్ కేసు విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
Follow us on

దిల్లీ: శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్‌ అధికారులు సహకరించడం లేదంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ కేసుపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. బుధవారం వాదనలు వినాల్సి ఉంది. కానీ జస్టిస్‌ నాగేశ్వరరావు దీనిపై విముఖత వ్యక్తం చేయడంతో కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేశారు. గతంలో బెంగాల్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించానని.. అందువల్ల ఈ కేసు విచారణను తాను చేపట్టలేనని నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు బెంగాల్ అధికారులు మలయ్‌ కుమార్‌ దే, వీరేంద్ర కుమార్‌, రాజీవ్‌ కుమార్‌ ఈ విషయంపై క్షమాపణలు తెలియజేస్తూ.. కోర్టులో ఫిబ్రవరి 18న ప్రమాణ పత్రం దాఖలు చేశారు.