AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా.. లేదంటే వెళ్ళిపోతాః ఎన్టీఆర్

సాధారణంగా సినిమా ఫంక్షన్లలో గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గానీ ఫ్యాన్స్ హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అది హీరోలకు విసుగు కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు ఎదుర్కొన్నారు. చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పాలని వారు చూస్తే.. అభిమానులు మాత్రం మధ్యలోనే అడ్డుతగిలి వారి స్పీచ్‌ను ముగింపు జేశారు. ఇక ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ […]

సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా.. లేదంటే వెళ్ళిపోతాః ఎన్టీఆర్
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 8:14 AM

Share

సాధారణంగా సినిమా ఫంక్షన్లలో గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గానీ ఫ్యాన్స్ హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అది హీరోలకు విసుగు కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు ఎదుర్కొన్నారు. చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పాలని వారు చూస్తే.. అభిమానులు మాత్రం మధ్యలోనే అడ్డుతగిలి వారి స్పీచ్‌ను ముగింపు జేశారు.

ఇక ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయన చిత్ర యూనిట్‌ను శుభాకాంక్షలు తెలపడమే కాకుండా.. సంక్రాంతికి విడుదలయ్యే మిగతా సినిమాలు కూడా విజయవంతం కావాలని కోరుకున్నారు. అయితే స్పీచ్ మాట్లాడాలని అనుకున్న ఎన్టీఆర్‌కు మొదట్లోనే అభిమానులు అడ్డుతగిలారు. ‘మీరు సైలెంట్‌గా ఉంటారా.. లేకపోతే వెళ్ళిపోతాను’ అని హెచ్చరించారు. దానితో కొంతసేపు ఫ్యాన్స్ కంట్రోల్ అయ్యారు

‘ఈ ఈవెంట్‌లో తాను కూడా ఓ భాగమైనందుకు ‘ఎంత మంచివాడవురా’ యూనిట్ సభ్యులందరికీ. అభిమానులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ్ రామ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారని.. కానీ ఎప్పుడూ కూడా మంచి కుటుంబసమేత చిత్రం చేయలేదనే వెలితి ఉండేదని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు అది కూడా దర్శకుడు సతీష్ వేగ్నేశ గారితో నిజమవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఆదిత్య సంస్థల కలయికలో ఈ సినిమా జనవరి 15న వస్తోందన్న ఆయన.. దీన్ని తప్పకుండా ఆదరించారని ప్రేక్షకులను కోరారు. కాగా, ఇంటివరకు జాగ్రత్తగా వెళ్లాలని ఫాన్స్ అందరికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Follow Us
అనవసరంగా రైలు చైన్ లాగుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి!
అనవసరంగా రైలు చైన్ లాగుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి!
విమాన టికెట్ పై RR అని ఉంటే ఏం జరుగుతుంది?
విమాన టికెట్ పై RR అని ఉంటే ఏం జరుగుతుంది?
రెస్టారెంట్ చెఫ్‌లు దాచే 3 సీక్రెట్ మసాలాలతో.. పనీర్ బటర్ మసాలా
రెస్టారెంట్ చెఫ్‌లు దాచే 3 సీక్రెట్ మసాలాలతో.. పనీర్ బటర్ మసాలా
బంగారం దిగుమతులు.. మన ఆర్థిక వ్యవస్థకు నష్టమా?
బంగారం దిగుమతులు.. మన ఆర్థిక వ్యవస్థకు నష్టమా?
టిఫిన్ బాక్స్‌లో పరాఠాలు రోజంతా మెత్తగా ఉండాలా? ఇదుగో టిప్స్
టిఫిన్ బాక్స్‌లో పరాఠాలు రోజంతా మెత్తగా ఉండాలా? ఇదుగో టిప్స్
పెరుగు త్వరగా పులవకుండా.. గడ్డలా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి
పెరుగు త్వరగా పులవకుండా.. గడ్డలా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి
ఫ్యాటీ లివర్‌ను లైట్ తీసుకోవద్దు.. నివారించేందుకు ఇవి తప్పనిసరి..
ఫ్యాటీ లివర్‌ను లైట్ తీసుకోవద్దు.. నివారించేందుకు ఇవి తప్పనిసరి..
నా కెరీర్‌లో ఆ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశా..
నా కెరీర్‌లో ఆ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశా..
భారతీయులు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏమవుతుందో తెలుసా..?
భారతీయులు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏమవుతుందో తెలుసా..?
హీరోయిన్‌గా వందల సినిమాలు..ఇప్పుడు చాక్లెట్ కంపెనీ ఓనర్.. ఎవరంటే?
హీరోయిన్‌గా వందల సినిమాలు..ఇప్పుడు చాక్లెట్ కంపెనీ ఓనర్.. ఎవరంటే?