లారెన్స్ తమ్ముడి వేధింపులు..! మీడియా ముందుకు యువతి..

|

Mar 07, 2020 | 4:46 PM

మల్టీ టాలెండెట్ పర్సన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోన్న రాఘవ లారెన్స్‌కి కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. అతని తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ (విన్నీ), తనను వేధిస్తున్నాడంటూ..ఓ లేడీ జూనియర్ ఆర్టిస్ట్‌ న్యూస్ ఛానల్‌ను ఆశ్రయించడం సంచలనంగా మారింది. అతడి ప్రేమను తిరస్కరించినందుకు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులపై హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి .. పోలీసులతో కుమ్మక్కై తననే జైలుకు పంపారని ఆరోపిస్తోంది. జైలు […]

లారెన్స్ తమ్ముడి వేధింపులు..! మీడియా ముందుకు యువతి..
Follow us on

మల్టీ టాలెండెట్ పర్సన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోన్న రాఘవ లారెన్స్‌కి కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. అతని తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ (విన్నీ), తనను వేధిస్తున్నాడంటూ..ఓ లేడీ జూనియర్ ఆర్టిస్ట్‌ న్యూస్ ఛానల్‌ను ఆశ్రయించడం సంచలనంగా మారింది. అతడి ప్రేమను తిరస్కరించినందుకు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులపై హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి .. పోలీసులతో కుమ్మక్కై తననే జైలుకు పంపారని ఆరోపిస్తోంది. జైలు నుంచి వచ్చాక కూడా తనను పదే, పదే వేధిస్తున్నారని..చంపేందుకు కూడా కుట్ర పన్నారని చెబుతోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కల్పించుకుని తెలంగాణ ఆడబిడ్డకు న్యాయం చేయాలని కోరుతోంది.

తనపై కావాలనే బ్రోతల్ కేసు పెట్టి 21 రోజులు జైల్లో పెట్టించారని, విచారణలో బాగంగా లాడ్జిలకు రమ్మని నీచంగా బిహేవ్ చేశారని ఆమె ఆరోపిస్తుంది. స్టేషన్‌కి పిలిచి తెల్లకాగితంపై బలవంతంగా సంతకం చేయించుకుని, అన్యాయంగా కేసు పెట్టారని వాపోతుంది. ఈ కామెంట్స్‌పై ఏసీపీ రవీందర్ రెడ్డి స్పందించారు. సదరు యువతికి,  లారెన్స్ తమ్ముడు ఎల్విన్‌కి గతంలో విబేధాలు ఉన్నాయని, ఈ విషయంలో పోలీసులపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇది మహేశ్ స్టామినా..సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్